May 18, 2024

People News Channel

Best News Web Channel

చిరుతపులి చర్మం అక్రమ రవాణా .. నలుగురు అరెస్టు

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్ : చిరుతపులి చర్మాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్ఐ) చెక్ పెట్టింది .. నిఘా వేసి నలుగురిని అరెస్ట్ చేసింది..ఈ మేరకు  విశాఖపట్నం జిల్లా అటవీ అధికారి అనంత్ శంకర్ బుధవారం ప్రకటన విడుదల చేసారు. చిరుతపులి చర్మాన్ని అక్రమణగీ రవాణా చేస్తునట్టు డిఆర్ఐ అధికారులు సమాచారమ్ అందింది .. దీంతో నిఘా వేయగా మంగళవారం ఓ హోటల్ వద్ద నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. అనంతరం విచారించి తనిఖీలు చేయగా గోళ్లు, మీసాలు చెక్కుచెదరకుండా చిరుతపులి చర్మాన్ని గుర్తించారు.వారి నుండి చిరుతపులి చర్మం తో పాటుగా  రెండు వాహనాలు , మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసి ,వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 నిబంధనల ప్రకారం స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

అరెస్టయిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుండి చిరుతపులి చర్మంతో విశాఖపట్నంకు వచ్చి  కొనుగోలుదారులను కనుగొని,చివరికి  డిఆర్ఎస్ఐ అధికారులకు పట్టుబడ్డారు. ఒడిశాలో మూడు, నాలుగు నెలల క్రితంచిరుతపులిని వేటాడగా, స్వాధీనం చేసుకున్న చర్మం కొలతలను పరిశీలిస్తే,చిరుతపులి పెద్దది అని ఊహించబడిందనీ జిల్లా అటవీ అధికారి అనంత్ శంకర్ పేర్కొన్నారు. దీనిపై అటవీ శాఖ తదుపరి విచారణ పురోగతిలో ఉందని పేర్కొన్నారు.