May 18, 2024

People News Channel

Best News Web Channel

మధురవాడలో ‘మా మీడియా హబ్‌ ’ ప్రారంభం

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్):జర్నలిస్టులు తమ వార్తలను పత్రికా కార్యాలయాలకు సులువుగా పంపించుకునేందుకు వీలుగా మా మీడియా హబ్ ప్రారంభమైంది. మధురవాడ పరిసర ప్రాంతాల్లోనీ జర్నలిస్టులు ఈ హబ్ సేవలను ఉచితంగా వినియోగించు కోవచ్చు. జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని ఏడో వార్డులో గల స్వతంత్రనగర్ లో సీనియర్ జర్నలిస్ట్ బంగారు అశోక్ కుమార్ ఈ హబ్ ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం ఉదయం మా మీడియా హబ్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధురవాడ జోన్ లో మా మీడియా హబ్ ఏర్పాటు చేయడం శుభ సూచికం అని అన్నారు ఈ హబ్ సేవలు స్థానిక జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఏర్పాటు చేసిన సీనియర్ జర్నలిస్ట్ బంగారు అశోక్ కుమార్ ఆయన సతీమణి ఝాన్సీని ఆయన అభినందించారు.

                                   

ఈ కార్యక్రమంలో పిఎంపాలెం సీఐ రామకృష్ణ ,సీనియర్ జర్నలిస్టులు ఆర్. రామచంద్రరావు, ఎన్. నాగేశ్వరరావు, కృష్ణారావు ,పి విజయ్ కుమార్, సాంబశివరావు, ఆనంద్,రామునాయుడు,మానం శ్రీను, శ్రీనివాస్,పసుపులేటి సురేష్,ఏడో వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, ఏడో వార్డు వైసీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, ఐదవ వార్డు వైసీపీ అధ్యక్షులు పోతిన హనుమంతురావు,టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, ఏడో వార్డు టిడిపి అధ్యక్షులు పిల్లా నర్సింగరావు,టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పిల్లా వెంకట్రావు ,కనకమహాలక్ష్మి దేవస్థానం సభ్యులు,వైఎస్ఆర్సిపీ సాంస్కృతిక విభాగం రీజనల్ కో – ఆర్డినేటర్ వంకాయల మారుతి ప్రసాద్,సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రాజేశ్వరి,7వ వార్డు బీసీ సెల్ అధ్యక్షులు బంగారు ప్రకాష్,ఏడో వార్డు వైసీపీ మహిళా అధ్యక్షురాలు రజిని,డి.ఆర్.యు.సి. సి సభ్యులు బాబ్జి, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ జే.ఎస్.రెడ్డి,వైసీపీ నాయకులు అల్లాడ లింగేశ్వరావు,వాండ్రాసి రవికుమార్ ,కుడితి రామారావు , అప్పన్న ,సీనియర్ నాయకులు వట్టికుల నాగమ్మ ,పసుపులేటి గోపీ ,బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాతపూడి ప్రదీప్ కుమార్ , 7వ వార్డు టీడీపీ కార్యదర్శి అచ్యుతరావు ,7వ వార్డు తెలుగు యువత అధ్యక్షులు మామిడి దుర్గారావు ,టీడీపీ భీమిలీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, 7వ వార్డు టీడీపీ సినీయర్ నాయకులు పోతిన నాయుడు,పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగోతి సూర్య ప్రకాష్,శెట్టిపల్లి జగన్మోహన్ చౌదరి,లెక్కల సింహాచలం నాయుడు ,బెల్లపు పాపారావు ,సీపీఎం పార్టీ నాయకులూ అప్పలరాజు ,పలువురు మధురవాడ సినియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు .