May 18, 2024

People News Channel

Best News Web Channel

ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో  గంగారావు అరెస్ట్ – మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ 

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్) :విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన తహసీల్దారు రమణయ్య హత్య కేసులో నిందితుడ్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసారు .. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది బృందాలు బెంగుళూరు,చెన్నై లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.. కాగా  చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడ్ని పట్టుకున్నారు.  సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ డా. రవిశంకర్ అయ్యన్నార్  వివరాలను వెల్లడించారు. మధురవాడలోని సర్వే నంబరు 381లో 6.85 ఎకరాల ఎసైన్దు భూమి ఉంది. అందులో 2015లో జెవెల్-99 పేరుతో ఓ నిర్మాణ సంస్థ 13 బ్లాక్ లలో ఒక్కో  బ్లాక్ కు  32 చొప్పున 8 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించింది. 2018లో అది ప్రభుత్వ భూమి అని తేలడంతో 22(ఏ)లో  పెట్టారు.  ప్రభుత్వం ఆ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి జీవో 388 ఇచ్చింది. క్రమబద్ధీకరించుకున్న ప్లాట్ల యజమానులంతా కన్వేయన్స్ డీడ్ తీసుకుని హక్కులు  పొందుతున్నారు. ఈ మేరకు జెవెల్ కమ్యూనిటీ గేట్ వే లో  మొత్తం ఫ్లాట్ల యజమానుల్లో 93 మందికి కన్వేయన్స్‌ డీడ్‌లు ఇచ్చేశారు. మిగిలిన వారిలో ఐదుగురు విదేశాల్లో ఉండగా మరో ముగ్గురు చనిపోయారు. ఈ ఎనిమిది ఫ్లాట్లకు సంబంధించి మురారి  సుబ్రహ్మణ్యం గంగారాం అలియాస్‌ గంగాధర్‌ పేరిట కన్వేయన్స్‌ డీడ్‌లు జారీచేయాలని కోరుతూ వారి వారసులు రూరల్‌ తహసీల్దారును కోరారు. దీనికోసం గంగాధరం ఎమ్మార్వో  కార్యాలయం చుట్టూ పలు మార్లు వచ్చి వెళ్తూ ఉండేవాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. . ఎమ్మార్వో రమణయ్య సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తే గానీ  గంగారాం పని పూర్తి అవ్వదు .. కానీ ఆ పని జాప్యం అవ్వడంతో గంగారాం విసుగు చెందాడు .. ఇదిలా ఉండగా నాలుగు రోజులు క్రితం తహసీల్దారు రమణయ్య బదిలీ జరగడంతో గంగారాం  శుక్రవారం రాత్రి రమణయ్య ఇంటి వద్ద వాగ్వాదానికి దిగాడు .. చివరకు దాడిచేసి హత్య చేసాడు.. 

చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడ్ని అరెస్ట్ :

తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు సుబ్రహ్మణ్యం గంగారాం అలియాస్‌ గంగాధర్‌ అలియాస్‌ జగన్‌ ను  చెన్నైలో అరెస్ట్ద్వా చేసారు. హత్య చేసిన తర్వాత గంగాధర్‌ తన ద్విచక్రవాహనంపై నేరుగా అనకాపల్లి వైపు వెళ్లి, శనివారం ఉదయాన్నే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. గంగాధర్‌ తన సెల్‌ఫోన్‌లోనే మేక్‌ మైట్రిప్‌ యాప్‌లో చెన్నైకి విమానం టిక్కెట్‌తోపాటు రైలు టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. గంగాధర్‌ సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ శనివారం ఉదయానికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టు చూపించి, తర్వాత లొకేషన్‌ చూపించకపోవడంతో చెన్నై వెళ్లిపోయినట్టు భావించారు. అక్కడికి హుటాహుటిన ఒక బృందాన్ని పంపించారు. కానీ గంగాధర్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి, శనివారం మధ్యాహ్నం బెంగళూరు మీదుగా చెన్నై వెళ్లే విమానం ఎక్కినప్పటికీ పోలీసులు గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నై విమానం ఎక్కిన గంగాధర్‌ అక్కడకు వెళ్లకుండా ట్రాన్సిట్‌ హాల్ట్‌ కోసం బెంగళూరులో విమానం ఆగడంతో అక్కడ దిగిపోయాడు.. తర్వాత గంగాధర్‌ బెంగళూరులోనే ఉన్నట్టు గుర్తించి ట్రాకింగ్‌ పెట్టగా, ఆదివారం ఉదయానికి చైన్నైలో ఉన్నట్టు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడు గంగారాం ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసారు. ల్యాండ్ ధరలు పెరిగిన దశలో  సహజంగా వివాదాలు వస్తాయని ఈ సన్దబంగా సీపీ పేర్కొన్నారు.  అందుకే కలెక్టర్ సహకారం తో ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటామన్నారు. విశాఖలో ల్యాండ్ వివాదాలపై ప్రతివారం విచారణ చేపట్టాలని నిర్ణయించామన్నారు.