May 18, 2024

People News Channel

Best News Web Channel

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం – గ్యాస్ లారీ చక్రాల కింద పడి ఇద్దరు విద్యార్థులు మృతి

  1. (విశాఖపట్నం – పీపుల్ న్యూస్): రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం వలన అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత చెందుతున్నారు.. ద్విచక్రవాహనంపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ,కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ దరించాలన్న కనీస నిబంధనలను పాటించడం లేదు..తద్వారా అనూహ్యంగా జరిగే ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు..తాజాగా విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు..పోలీసుల సమాచారం మేరకు విశాఖ నగరం నుండి నలుగురు విద్యార్థులు సోమవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై విజయనగరం పైడి తల్లి అమ్మవారి గుడికి వెళ్లారు.దర్శనం అనంతరం తిరిగి మధ్యాహ్నం విశాఖ వస్తుండగా మార్గమధ్యంలో సరిగ్గా బోరవానిపాలెం జాతీయ రహదారి వద్ద వాళ్లకు
    గేదె అడ్డుగా వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని పక్కకు తప్పించే క్రమంలో పక్కనే వెళ్తున్న గ్యాస్ లోడ్ లారీ చక్రాల కింద పడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన విద్యార్థులు మద్దిలపాలెంలోని నీలాపువారి వీధికి చెందిన మణి,నిరంజన్లుగా పోలీసులు గుర్తించారు. మరణించిన విద్యార్థుల్లో ఒకరు ఇంజినీరింగ్, మరొకరు ఐటీఐ చదువుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పిఎంపాలెం పోలీసులు ఘటనా
    స్థలానికి చేరుకొన్నారు..మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజుహెచ్ కు తరలించారు..
    కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి..