May 18, 2024

People News Channel

Best News Web Channel

జల్లెడ పట్టారు ..! విశాఖలో ఆకస్మిక నాకాబంధీ

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్):  నేరస్తుల ఆగడాలకు  విశాఖ పోలీసులు కళ్లెం వేశారు..అసాంఘిక శక్తులపై కొరడా  ఝులిపించారు.. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా పోలీస్ కమిషనర్ డా.ఏ.రవి శంకర్ ఆదేశాలతో నగర జాయింట్ సిపి   కే.ఫకీరప్ప  ఆధ్వర్యంలో నగరమంతా ఆకస్మిక నాకాబంధీ  నిర్వహించారు. మంగళవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు 1200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది 110 టీంలు గా ఏర్పడి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  నిర్వహించిన ఈ నాకాబంధీ నిర్వహించారు.   ప్రశాంతమైన వాతారణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా, నగరమంతా జల్లెడ పడుతూ అక్రమ మద్యం, నగదు, ఇతర అసాంఘిక , అనుమానిత వస్తువులను పూర్తిగా నివారించేలా ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. .ప్రత్యేకంగా ఈ నాకాబందీలో  గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి  సారించారు. , సరైన ద్రువపత్రాలు లేని వాహనాలను, నగదు, బంగారం, వెండి, అక్రమ మద్యం, బియ్యం వంటి వాటిని సీజ్ చేసి తగు విచారణ చేపట్టారు.  పోలీసులు నిర్వహించిన నాకాబందీలో  14,220 వాహనాలు తనిఖీ చేయగా, సరైన ధృవపత్రాలు లేని 663 వాహనాలు సీజ్ చేశారు.పినగాడి జంక్షన్ లో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, 10 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనం సీజ్ చేసారు. శనివాడ జంక్షన్ లో  14.47 కేజీల బంగారం , 13.31 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.  .రైల్వే స్టేషన్ సమీపంలో 4.5 లక్షల నగదు, ఆరు మద్యం సీసాలు ,మద్దిలపాలెం జంక్షన్ లో  4.29 లక్షల నగదును  స్వాధీనం చేసుకున్నారు.గోపాల పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ లో  ఒక వ్యక్తిని అరెస్టు చేసి, సుమారు 860 కేజీల(18 బస్తాలు) బియ్యం ను, ఒక ఆటోను సీజ్ చేసారు

స్పెషల్  ఎన్ఫోర్మెంట్ బ్యూరో  తనిఖీలు

విశాఖలో పోలీసులు మంగళవారం రాత్రి నిర్వహించిన నాకాబందీలో భాగంగా స్పెషల్  ఎన్ఫోర్మెంట్ బ్యూరో  తనిఖీలు  చేపట్టింది. గంజాయి కేసులో  ఒకరిని అరెస్టు చేసి 12 కే.జిల గంజాయి స్వాధీనం చేసుకున్నారు . పలు .ప్రాంతాలలో అక్రమ మద్యం కలిగిన 8 మంది పై కేసులు నమోదు చేసి 21.22 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు . .సరైన ద్రువ పత్రాలు లేకుండా రూ.  5,97000 లు   తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. .రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తం లో నగదు , బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను తీసుకువెళుతున్నట్లయితే వాటితో పాటుగా తగు ధ్రువపత్రాలు జతగా తీసుకువెళ్లాలని , లేని యెడల వాటిని సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేసారు.  కావునా పెద్దమొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణిస్తున్నప్పుడు తగు ధ్రువ పత్రాలు కలిగి ఉంచుకోవాలని ప్రజలకు పోలీసులు  విన్నవించారు. .ఎలక్షన్ల నేపథ్యంలో నగరంలో ఎటువంటి చట్టవిరుద్ధ రవాణాలు జరగకుండా కట్టడి చేసేందుకు, నగర పోలీసులు నిరంతరం శ్రమిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. , ప్రజలు  ఎల్లవేళలా బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని నగర పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.