May 18, 2024

People News Channel

Best News Web Channel

కోట బొమ్మాళీ పీఎస్.. మళ్లీ చిన్న సినిమాకే పట్టం కడుతున్న ప్రేక్షకులు..

ఈ రోజుల్లో సినిమా బాగుంటే చాలు.. అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరని పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్న సినిమాలకు గోల్డెన్ ఇయర్ అనొచ్చు. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ వారం ఆదికేశవ లాంటి క్రేజీ సినిమా విడుదలైనా కూడా ప్రేక్షకుల ఓటు మాత్రం కోటబొమ్మాలి సినిమా వైపు వెళుతుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఆదికేశవ పరమ రోటీన్ సినిమా అంటూ తేల్చి పడేశారు ప్రేక్షకులు.