May 18, 2024

People News Channel

Best News Web Channel

 పోలీస్ వాహనంలో  పసిపిల్ల.. వివాదాస్పదంగా మారిన విశాఖ  టూటౌన్  పోలీసుల తీరు 

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్ ):  విశాఖ నగరంలోని  రెండో పట్టణ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.. పసి పిల్లను పోలీస్ వాహనంలో ఎక్కించడంతో ప్రజా సంఘాలు   మండిపడుతున్నాయి..బాధితుల సమాచారం  మేరకు వివరాలు ఇలా  ఉన్నాయి  ఈ ఏడాది ఏప్రిల్ 10న కాంచీపురం ముగ్గా బ్రాంచ్లో పనిచేస్తున్న మురళీకృష్ణ మృతి చెందాడు.ఈ మేరకు  అతని భార్యకు అదే రోజు అర్ధరాత్రి ఫోను వచ్చిందన్నారు. అయితే   పోస్టార్టం చేయించడం,చనిపోయినప్పుడు మృతుడు  నోటి నుంచి సొంగలు రావడం పలు  అనుమానాలకు తావిస్తుందని అనుమానం వ్యక్తం చేసారు. ఇదిలా ఉండగా   గత 8 మాసాలుగా ఆ కుటుంబానికి న్యాయం  చేస్తామని యాజమాన్యం ఆశ పెడుతూ ఇంతవరకు నష్ట పరిహారం చెల్లించలేదని బాధితులు  తెలిపారు. దీంతో తాము యాజమాన్యంతో మాట్లాడటానికి వెళ్లేటప్పుడు యాజమాన్యం నిరాకరించడం జరిగిందని, ఈ విషయంపై విశాఖ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేయగా కమిషనర్ స్పందించి వెంటనే కేసు నమోదు చేయాలని టూ టౌన్ పోలీసులను ఆదేశించారని తెలిపారు. అయినా సరే టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయకుండా యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.దీంతో చనిపోయిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయని ముగ్ధ కంచీపురం షోరూంపై కేసు నమోదు చేయాలని సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో మురళీకృష్ణ కుటుంబ సభ్యులు శనివారం షాపింగ్ మాల్ ముందు బిక్షాటన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని భిక్షాటన చేయకూడదని నిరసనకారులకు హితబోధ చేశారు.  కార్మికుని కుటుంబానికి న్యాయం చేసేంతవరకు కదిలేది లేదని వారంతా పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది.అనంతరం పోలీసులు బలవంతంగా సుబ్బారావుతో పాటు మురళీకృష్ణ భార్య, అత్త, సిఐటియు నాయకులు కార్యకర్తలు వ్యాన్ ఎక్కించి స్టేషన్ కు  తరలించారు. అయితే పసిపిల్లలను కూడా పోలీసులు వదలకుండా వ్యాన్ లో ఎక్కించడంపై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతున్నాయి..దీంతో  టూటౌన్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది