May 18, 2024

People News Channel

Best News Web Channel

 విశాఖను  ప్రమాదరహిత నగరంగా మారుద్దాం:ట్రాఫిక్ ఏడిసిపీ  శ్రీనివాసరావు 

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్ ): విశాఖను ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దుదామని ట్రాఫిక్ ఏడిసిపీ జి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. . నగరంలోని శనివారం  ఓ హోటల్ లో రహదారి ప్రమాదాలు నివారణ పై ఈస్ట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహనా సమావేశం నిర్వహించారు.   ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ విశాఖపట్నం జనాభా పెరుగుతూ ఉందని,ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చేముందు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పాలన్నారు.

షీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. గత ఏడాది  సంభవించిన  మరణాల్లో మూడో వంతు తాగి వాహనాలు నడపడం ద్వారానే చోటు చేసుకున్నాయని ఆవేదన చెందారు. హోటల్ నిర్వాహకులు కూడా సామాజిక బాధ్యత తో మెలగాలన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల నిముషం లో జీవితాలు తారు మారు అవుతాయన్నారు. సుందరమైన నగరం లో మరణాలు రేటు తగ్గించాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో   ట్రాఫిక్ ఏసీపీ జాన్ మనోహర్, సీఐలు  సూర అమ్మినాయుడు, ప్రసాద్,  సూరి నాయుడు, ఎస్ఐ లు, వివిధ హోటల్లు, బార్ల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.