May 18, 2024

People News Channel

Best News Web Channel

అవంతి తోనే ఇనాం భూముల రైతులకు న్యాయం

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం ):  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు తోనే రైతులకు న్యాయం జరిగిందని స్థానిక రైతులు అంటున్నారు..భీమిలి నియోజకవర్గం పరిధిలో గల రూరల్  ఆనందపురం,భీమిలి,పద్మనాభం మూడు మండలాల లో సుమారుగా 1700   ఎకరాలు వరుకూ ఇనాం భూములు ఉన్నాయి.ఇనాం భూములు కావడం వలన గత టిడిపి ప్రభుత్వం లో రైతులందరూ కాళ్ళు అరిగేలా తిరిగి మాకు తగు న్యాయం చేయండి అని ఎన్నో అర్జీలు సమర్పించినప్పటకీ రైతులకు న్యాయం చేయండలో గత టిడిపి పాలకులు వ్యవహారం నిమ్మకు నీరెత్తినట్టు గా ఉండేదని రైతులు అంటున్నారు.

ఇనాం భూములు విషయంలో చూసుకుంటే ఆనందపురం మండలంలో  బోని,పేకేరు,ముచ్చర్ల గ్రామాల్లో,భీమిలి లో వరుకూ వస్తే నారాయణరాజు పేట అదే విదంగా పద్మనాభం మండలం లో కృష్ణాపురం,బిఆర్ తాళ్ళవలస,పద్మనాభం గ్రామాల్లో ఇనాం భూములు ఉన్నాయి.వీటికి వ్యవసాయ శాఖ పరంగా ఎంత మంది రైతులు అయితే ఉన్నారో వారందరికి వైసిపి ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోడ్పాటు తో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు 50 శాతం రైతు మిత్రా పథకం ఇవ్వడం జరిగిందన్నారు.ముఖ్యంగా బోని గ్రామంలో పంట రుణాలు మంజూరు చేయడం జరిగింది.అంత మాత్రమే కాకుండా వీరికి కౌలుదార్లు కార్డులు ఇవ్వడంతో పాటు అన్ని గ్రామాల్లో ఉన్న రైతులకు పంట రుణాలు ఇవ్వడం జరిగిందని స్థానిక రైతులు అంటున్నారు.రైతులకు మరింత ఉపయోగార్థం ఉండాలనే ఆలోచనతో 9 లక్షల రూ వ్యయంతో కస్టమ్స్ హైరింగ్ సెంటర్ ను అవంతి ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టి దానికి 3లక్షల 35 వేలు రూ వరుకూ సబ్సిడి జరిగిందన్నారు.ఇవే కాకుండా రైతులు అందరికి ఒక్కో రైతుకు 7,500 రూ రైతు భరోసా పథకం అందివ్వడం జరిగిందనీ,అంతేకాక రైతులకు ఇతరత్రా స్కీమ్ లు గ్రామీణ విత్తనోత్పత్తి పథకం అలాగే  వ్యవసాయ ఉత్పత్తుకి ఉపయోగకరమైన చిన్న తరహా ఉపకరణాలు అందివ్వడం జరిగిందని రైతులు తెలిపారు. సాదారణ రైతులు తో పాటు వీరికి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ 5ఏళ్ళ పాలనలో ప్రతీ రైతుకు అందిచ్చారని రైతులు అంటున్నారు..