May 18, 2024

People News Channel

Best News Web Channel

పుట్టిన గడ్డకి సేవ చేసే అవకాశం కల్పించండి – స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వైఎస్సార్ సీపీతోనే సాధ్యం – అనునిత్యం మరింత అండగా ఉంటాను ఆశీర్వదించండి – ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు – మారికవలస ఆరోకే కాలనీ రోడ్ షోలో బొత్స ఝాన్సీలక్ష్మి

(పీపుల్ న్యూస్ – మధురవాడ):   చంద్రబాబు నాయుడు అవ్వతాతల నోటికాడ కూడును కాలితో తన్నాడని విశాఖ పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చెప్పారు. మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు ఆర్డీకే కాలనీలో ఆమె భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ముంగిటే పాలన, సంక్షేమాలు కొనసాగాలన్నా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చెయ్యడమే కాదు అవి అందుతున్నదీ లేనిదీ కూడా చూడడానికి నాయకులను ఇంటింటికీ పంపించారన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తానని జగన్ మోహన్రెడ్డి ఎన్నికలు మేనిఫెస్టోలో చేర్చడంపై ప్రతి ఒక్కరూ తమ మద్దతును తెలుపుతున్నారని చెప్పారు. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏపీ శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు అంతకంటే ఎక్కువ హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాది అవకాలు మెరుగు పరచడానికి ప్రభుత్వం ఆదానీ డేటా బేస్,అమెజాన్ తదితర సంస్థలు ద్వారా కృషి చేస్తుందని చెప్పారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ సారి గతం కంటే రెండింతలు మెజార్టీతో గెలుస్తారన్నారు.స్టీల్ ప్లాంట్ పరిరక్షించ బడాలంటే వైఎస్సార్సీపీ రావాలని, పుట్టిన ప్రాంతానికి మేలు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

పరిపాలనా రాజధాని కావాలంటే జగన్ రావాలి:

విశాఖ పరిపాలనా రాజధాని కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎమ్ కావాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని, దానికి అంతా సిద్దం కావాలన్నారు. 10ఏళ్లు తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడే రెడి మేడ్నాయకులు వస్తున్నారని, ఎన్నికలు తర్వాత గంటా ఈ ప్రాంతంలో కనిపించడని, ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెపుతారని, వారి మాటలు ఎవ్వరూ వద్దని చెపన్పారు. ఏమాత్రం పొరపాటు జరిగినా అమరావతికే రాజధాని వెళ్లిపోతుందన్న విషయం అంతా గమనించాలన్నారు. ప్రజలువద్దకే నాయకులు, అధికారులు రావాలంటే జగన్మోహన్ రావాలన్నారు. తనతో పాటు ఎమ్పీ అభ్యర్ధి బొత్స ఝాన్సీలక్ష్మికి ఫ్యాన్ రెడ్డి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిన హనుమంతురావు ఆధ్వర్యంలో చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయం నుంచి భారీ బైకు ర్యాలితో మారికవలస ఆర్ కే కాలనీకి ఆర్టీకే చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మహిళలు పార్టీ జెండాలు స్వాగతం పలికి, గుమ్మడి కాయలతో దిష్టి తీసి హారతులు పట్టారు. కార్యక్రమంలో వివిధ విభాగాలు నాయకులు పోతిన సురేష్ కుమార్, జేఎస్ రెడ్డి, బోయి సుజాత. చేకూరి రజని, బోర సూర్రెడ్డి, రుషికేష్, ప్రసాద్,కామేశ్, మహాలక్ష్మి నాయుడు, వారణాశి శ్రీను, శంకరరావు, రమణ,లక్ష్మి , గాయత్రి , సీత ,టైలర్ రమణ , మూర్తి తదితరులు పాల్గొన్నారు