May 18, 2024

People News Channel

Best News Web Channel

విశాఖ ప్రజలంతా మా కుటుంబం – వారే నాకు బలం..అండ..దండ – ఓటేసి ఆశీర్వదించండి -పార్లమెంటులో విశాఖ గళాన్ని వినిపిస్తా – వైయస్ఆర్సీపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ –

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):  విశాఖపట్టణం ప్రజలంతా తమ కుటుంబమనీ, ఆ కుటుంబమే తన బలమని వారే తనకండగా ఉంటారని పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు.  ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశమిచ్చి, పుట్టినింటికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా ఉంటూ తనను ఓటు రూపంలో ఆశీర్వదించాలని ఆమె అభ్యర్దించారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్ధి అడారి ఆనంద కుమార్ తో కలిసి ఆదివారం నాడు  గోపాలపట్నంలో నిర్వహించిన కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు ల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖను, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి, వెనకబాటు తనాన్ని దూరం చేసేందుకు కట్టుబడి ఉన్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి సిఎంగా చేసుకోవాడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛంధంగా ముందుకు రావాలని విశాఖ పార్లమెంటు అభ్యర్ధి  బొత్స ఝాన్సీ కోరారు. కన్నవారి ప్రాంతంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, అనునిత్యం వారి సేవలోనే ఉండే తనకు ఓటు వేయాలని కోరారు.

బిసిలంటే వెనకబడిన వర్గాలు కాదని, బ్యాక్ బోన్ వర్గాలంటూ నిర్ధిష్టంగా ప్రకటించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యత నిస్తున్నారని, అందులోనూ రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తూ వారి ఉన్నతికి దోహదం చేస్తున్నారని, అందులో భాగంగానే బిసి మహిళనైన తనకు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లభించిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ,  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా వృధ్ది చెందాలన్న తపనతో పనిచేస్తూ, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని ప్రకటించారన్నారు. విశాఖ ప్రజలకు లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని, జగన్ మోహన్ రెడ్డి గారికి, వైయస్ఆర్సీపీ కి అండగా ఉంటూ ఉత్తరాంధ్రకు గుండెకాయలాంటి విశాఖను లక్ష కోట్ల రూపాయల ప్రణాళికతో రూపొందించిన విజన్ తో సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ విషయంలో పొరపాటు చేస్తే తీవ్రంగా నష్టపోతామని ఆమె హెచ్చరించారు.ఈ ఆత్మీయ సమావేశంలో విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీధర్ , బెహరా భాస్కర్, సత్యనారాయణ, ఉమారాణి, సురేష్ తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో ఆయా కులాల వారు పాల్గొన్నారు.