May 18, 2024

People News Channel

Best News Web Channel

జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా చేసిన ప్రజారంజక పాలన, సంక్షేమం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు – విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం0;  విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్సిపి విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మీ పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని ఒక హోటల్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా చేసిన ప్రజారంజక పాలన, సంక్షేమం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు అయితే ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నాయని వారి అసలు నైజాంని ప్రజలకు వివరించాలన్నారు. గతంలో తాను రెండుసార్లు ఎంపీగా ఉన్నప్పుడు విశాఖ పరిశ్రమల కోసం పార్లమెంట్లో పోరాడానని అన్నారు.విశాఖ తన పుట్టినిల్లుని ఎక్కడ సేవ చేసే భాగ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు సుశిక్షితులైన సైనికుల్లా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు ఓటర్లను సంసిద్ధం చేయాలన్నారు.
,విశాఖ అభివృద్ధి చెందిందంటే అది కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలోనేనని మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే విశాఖ ప్రాజెక్టులకు మోక్షం కలిగిందని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి కేకే రాజు అన్నారు.  మరో పది రోజులలో ఎన్నికలు జరగనున్నాయని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.  కూటమి కట్టి వచ్చిన పార్టీలు విశాఖపట్నంకి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. చెప్పింది తూచా తప్పక పాటించి మళ్లీ చెయ్యబోయేదే చెప్పిన జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.గత ఐదేళ్లు తనకు పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మద్దతుతో విశాఖ నార్త్ ప్రజల బాగోగులను చూసాను అన్నారు.  దక్షిణ భారతంలోనే అతి పెద్దదైన ఇన్ ఆర్బిట్ మాల్ ప్రస్తుతం నిర్మాణం జరుగుతోందన్నారు దీనివలన వేల మందికి ఉపాధి కలుగుతుందని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.  పార్టీ ఐక్యతకు మారుపేరుగా రాష్ట్రంలోనే ఉత్తమంగా నిలిచిన విశాఖ ఉత్తర పార్టీ కార్యకర్తలుమరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ విశాఖ ఉత్తర వైఎస్ఆర్సిపి పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, బాణాల శ్రీనివాసరావు, విఎంఆర్డిఏ చైర్మన్  చంద్రమౌళి, పీల  ఉమారాణి పేడాడ రమణకుమారి అనూష పట్నాయక్  వైఎస్ఆర్సిపి విశాఖ ఉత్తర నాయకులు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.