May 18, 2024

People News Channel

Best News Web Channel

వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గంటా శ్రీనివాసరావు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);   భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఎం.వి.పి.కాలనీలోని ఆయన నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. పార్టీ విజయానికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. పొట్నూరు గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రఘుమజ్జి వెంకట్రావు, డ్వాక్రా లీడర్ కొవ్వాడ భారతి, సర్పంచ్ గా పోటీ చేసిన రఘుమజ్జి అప్పలరాజు, రఘుమజ్జి బంగారు నాయుడు, అయినాడకు చెందిన పూసర్ల సూర్యనారాయణ, దువ్వు శంకర్, పినింటి రాజబాబు, నీలారి రమణ, దువ్వు శివ, పూసర్ల ఆదిబాబు, దువ్వు శ్రీను, నవీన్, పిన్నింటి జగదీష్, దువ్వు రాజు, అప్పలనాయుడు, అప్పలరాజు, పిన్నింటి భాను, ఈగల వాసు, దువ్వు మణికంఠ, ఎన్. ప్రకాష్, మధురవాడ ధర్మపురి కాలనీకి అధ్యక్షురాలు, జిల్లా వెలమ సంఘం నాయకురాలు అమ్మాజి, మాజీ ఎంపీపీ గోపీరాజు ఆధ్వర్యంలో పద్మనాభం విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేము అప్పలాచారి, ఉపాధ్యక్షుడు వేము ఈశ్వరరావు సహా 200 మంది సభ్యులు పార్టీలో చేరారు.

98 వార్డు నుంచి :

98 వార్డు కార్పొరేటర్ పిసిని వరహా నరసింహం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు యువకులు టిడిపిలో చేరారు. వారికి పసుపు కండువాలు వేసి భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో బంతి ఈశ్వరరెడ్డి, గనిరెడ్డి జ్ఞానేశ్వరరావు, నేమాలి లోకేష్, కాండ్రేగుల ఉమా మహేష్, దమ్ము అప్పలరాజు, చైతన్య రెడ్డి, గౌరి శంకర్, సుమంత్, సాయి కుమార్, గణేష్, సూరిబాబు, త్రినాథ్, బంతి చైతన్య, ఆర్.కుమార్, సీహెచ్.రాజు తదితరులు ఉన్నారు. భీమిలి టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు కూడా పాల్గొన్నారు.