May 18, 2024

People News Channel

Best News Web Channel

ముకుందపురం, సింహాచలం లలో వైసీపీకి షాక్ – భీమిలి టిడిపిలోకి చేరికలు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):భీమిలి నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికలు వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం ఆనందపురం మండలం ముకుందపురం, 98 వ వార్డు లోని సింహాచలం ప్రాంతాల నుంచి 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టిడిపి కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. వైసీపీ ప్రజావ్యతిరేక పోకడల పట్ల ప్రజలు విసుగు చెందారన్నారు. ఈసారి రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముకుందపురం నుంచి పార్టీలోకి చేరిన వారిలో మాజీ వార్డు సభ్యులు కరోతు అప్పలనాయుడు, కోట్ల అక్కన్న గౌరి శ్రీనివాసరావు, మచ్చ అప్పలనాయుడు, కోరాడ సూరిబాబు, కోరాడ అప్పలరాజు, బి.కనకారావు, ఎస్.అప్పారావు, ఎర్ర రామారావు, ఎర్ర వెంకట్రావు, ముచ్చపల్లి రమణ, ముచ్చపల్లి ఎర్రిబాబు, బంటుపల్లి రాజు, ఎస్. చిన్న అప్పారావు, పిన్నింటి గౌరీష్, కలిమి రాహుల్, మీసాల సూరినాయుడు, కోట్ల సాయి, కోట్ల నారాయణరావు, ఎన్ని రమణ, ఎం.రమణ, కోరాడ అప్పలనాయుడు, కలిమి ముత్యాలరాజు, కింతాడ అప్పలనారాయణ, కింతాడ అప్పారావు, కోరాడ గణేష్, మచ్చ వెంకట్రావు, మచ్చ నాగు, గొలగాని శంకర్రావు, చెల్లుబొయిన అప్పన్న, కలిమి కోటరాజు తదితరులు ఉన్నారు. సర్పంచ్ దొంతల నాగులు తాత, మాజీ సర్పంచ్ కోట్ల సత్తిబాబు, పార్టీ అధ్యక్షుడు కోట్ల రమణ, బూత్ ఇంచార్జీ కోట్ల రవికుమార్, వార్డు సభ్యులు కండి రమణ, గాడిపల్లి రమణ, దొంతల రమణ ఆధ్వర్యంలో వీరి చేరికలు జరిగాయి.
పసుపు కండువా కప్పుకున్న సింహాచలం వైసీపీ సచివాలయం కన్వీనర్
సింహాచలం సచివాలయం వైసీపీ కన్వీనర్ దొంతల సంతోష్ తన అనుచరులతో టిడిపిలో చేరారు. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల టిడిపిలో చేరిన అడవివరం కో ఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు బంటుబిల్లి మహేష్ కూడా గంటాను మర్యాదపూర్వకంగా కలిశారు. 98 వార్డు కార్పొరేటర్ పిసిని వరహా నరసింహం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇంచార్జీ కోరాడ రాజబాబు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.