May 18, 2024

People News Channel

Best News Web Channel

టీడీపీ లో చేరిన వైసిపి నేత సినినిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్టు అధినేత కంచర్ల అచ్చుత్‌రావు టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఎం.శ్రీభతర్‌, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా అడివివరం నుంచి ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్టు కార్యాలయం వరకూ టీడీపీ కార్యకర్తలు, కంచర్ల అభిమానుల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని, విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్ధి వెలగపూడిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.  పక్క పార్టీల వారు సైతం వెలగపూడి రామకృష్ణబాబు ప్రజలపై చూపించే ఆప్యాయత, అనురాగాన్ని మొచ్చుకుంటారన్నారు. అటువంటి వెలగపూడిని నాల్గొవ సారి  విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ప్రజలంతా కృషి చేయాలన్నారు. అదే విధంగా మనకు కేటాయించిన రెండు ఓట్లను ఎంపీ అభ్యర్ధి శ్రీభరత్‌కు, వెలగపూడికి సైకిల్ గుర్తు పై ఓట్లువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్టు సభ్యుడు అమరేశ్వర్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతానని తెలిపారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ వైసిపి లో నెల రోజులు కుడా నిలవలలేక పోయారు మంచి వ్యక్తి సేవతత్త్పరుడు అచ్యుతరావు అని అన్నారు..అలాంటి పేద ప్రజలకు సేవ చేసేవారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న వైసిపి లో ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు… చాలా మంది టీడీపీ లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అని దానికి సంకేతం వచ్చేది ఉమ్మడి పార్టీ అని శ్రీ భరత్ తెలిపారు… అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ కచ్చితంగా కూటమి ఘనవిజయం సాధిస్తుంది ..అచ్యుతరావు రాకతో నాకు వెయ్యి ఏనుగుల బలం చేకూరింది అని అన్నారు… జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అచ్యుతరావు సేవలను కొనియడతు ఇలాంటి సేవ గుణాలు కలిగిన వ్యక్తి టీడీపీ చేరడం చాలా శుభపరిణామం అని ఆయన వెంట ఇన్ని వేలమంది అభిమానులు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు..సీనియర్ టీడీపీ నేత అక్కరమాని వెంకట రావు మాట్లాడుతూ…ఉపకార్ ట్రస్ట్ ద్వారా  ఆరిలోవ ప్రాంతంలో అచ్యుతరావు ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తున్నారు అని ఇలాంటి సేవ గుణాలు కలిగిన నేత ను కూడా వైసిపి పట్టుమని 10రోజులు కూడా ఉంచుకోలేని పరిస్థితి లో ఆ పార్టీ ఉందని ఆయన అన్నారు..

అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ.. అచ్యుతరావు సేవలు వెల కట్టలేనివి అని అతని సేవ నిరతిని చూసి నేను కూడా ఆయన బాటలోనే అచ్యుతరావు ఆహ్వానం మేరకు టీడీపీ చేరానన్నారు..ఎస్సి సెల్ నేత పారిపల్లి రామారావు మాట్లాడుతూ.. అచ్యుతరావు వెనక నేను నడుస్తానని ఆయన బాటలో అడుగులు వేస్తూ ఉమ్మడి గెలుపు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు, కంచర్ల అభిమానులు, స్థానిక టీడీపీ , జనసేన ,బీజేపీ నేతలు, స్ధానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.