May 18, 2024

People News Channel

Best News Web Channel

ఎన్డీఏ కూటమి తోనే మహిళలకు మరింత ప్రాధాన్యత – 5వ వార్డు ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ మొల్లి హేమలత

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఐదో వార్డ్ సాయిరాం కాలనీ ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని అలాగే సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి 15000 , ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం తదితర మహిళ సంక్షేమ పథకాలుతో మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు. కావున రానున్న సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ఎన్ డి ఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు అయిన విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ కు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు లకు సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు, వార్డ్ టిడిపి అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ జనసేన అధ్యక్షులు దేవర శివ, భీమిలి నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మిశ్రీను,జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ బోయి శ్రీకాంత్ రెడ్డి,టీడీపీ ఉపాధ్యక్షులు ఈగల రవికుమార్, జనసేన ఉపాధ్యక్షులు దారపు సూరిబాబు,ఇమంది శ్రీను,ఈశ్వరరావు,ధర్మారావు,సింహాచలం నాయుడు,వార్డ్ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు, ఆవాల నీలయ్య, కరుమోజు గోవిందరావు, వైకుంఠ రావు,దుర్గారావు, నారాయణరావు, రాజు, మన్మధరావు ,ధనుంజయ,ఓలేటి శ్రావణ్,మోకర రవికుమార్, వంక నూకరాజు,మదీనా,మాధవ, రాంబాబు,జ్ఞానేశ్వరరావు, జనసేన నాయకులు సిద్దు, రమణ, మోహన్ గోపాల్,గౌరీ, సంతోష్,నారాయణ ,శర్మ , కిరణ్, ఆశోక్,రాజేశ్,నరేష్,వెంకట సాయి, టిడిపి నాయకులు నల్లన ఆనందరావు,అప్పన్న, యువత అధ్యక్షులు కొండపురాజు, పోరా అప్పల సూరిబాబు రెడ్డి, టిడిపి మహిళ నాయకులు మిత్తాన రవణమ్మ,బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు,దుర్గారావు, రామ నాయుడు, గంటా రమేష్,నారాయణ స్వామి, టిడిపి , జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.