May 18, 2024

People News Channel

Best News Web Channel

గాజు గ్లాసు విషయంలో హైకోర్టులో జనసేనకు చుక్కెదురు

(పీపుల్ న్యూస్ – అమరావతి):  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గాజు గ్లాసు సింబల్ పై  జనసేన పార్టీకి నిరాశే ఎదురైంది.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ  జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై రెండు రోజులుగా  వాదనలు జరిగాయి.. అయితే, నిన్న అనగా మంగళవారం  ఎన్నికల కమిషన్  హైకోర్టును 24 గంటల సమయం కోరింది.. దీంతో బుధవారం  కీలక విషయాలను వెల్లడించింది… జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ.. జనసేన పోటీ చేస్తున్న 2 ఆ పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్… గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్.. దీంతో.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్టు అయినా.. మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఏనాడూ పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఏదో ఒక సాకుతో ఎన్నికల్లో పోటీ చేసేవారు కాదు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ గాజు గ్లాసు విషయంలో రచ్చ జరిగేది. ఈసీని బతిమిలాడుకోవడం, గుర్తు పోకుండా ఉండేందుకు ప్రయత్నించడం.. ఇలా జరుగుతోంది తంతు. ఈసారి జనసేన ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నా అక్కడ జరగాల్సిందే జరిగింది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఈసీ పేర్కొంది. చివరకు నామినేషన్లు పూర్తయి, గుర్తులు కేటాయించే సమయానికి జనసేన రచ్చ చేస్తోంది. గాజు గ్లాసు ఇంకెవరికీ ఇవ్వడానికి వీల్లేదంటూ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకి ఈసీ ఇచ్చిన వివరణ చూస్తే జనసేనకు షాక్ తప్పదని తేలిపోయింది. అంటే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ని గాజు గ్లాస్ బాగా ఇబ్బంది పెట్టబోతోందనమాట.