May 18, 2024

People News Channel

Best News Web Channel

అమరేశ్వర్ హత్య కేసులో వైసీపీ నేతను అరెస్టు చేయకపోవడం సరికాదు – బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: కంచర్ల

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):  రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చుసిన అరాచకాలు, హత్య రాజకీయాలు నిత్యం జరుగుతున్నాయని జనసేన కార్పోరేటర్‌ పీతల మూర్తియాదవ్‌  అన్నారు. మంగళవారం విశాఖ టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరిలోవలోని  దళిత యువకుడు అమరేశ్వర్ పై జరిగిన దారుణం విషయములో కనీసం చర్యలు తీసుకో పోవడం సరికాదు అన్నారు. వైసీపీ నేతగా చెప్పుకునే మహిళ దళిత యువకుడు ను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అతని నుండి డబ్బు తీసుకొని మరి కొంత మందిని చేరిస్తే వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారుగా  మూడు కోట్లు రూపాయిలు వసూలు చేసుకొని, తీరా ఉద్యగం ఇవ్వకుండా సేవ చేసుకునే ఇతడిని ఇబ్బంది పెట్టి అక్రమ సంబంధం అని చెప్పి హత్య చేసి నడి రోడ్ పై పడేసారు. అధికారం ఉంది కాదా అని పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ హత్యను మరో కోణంలో మార్చేలా చేస్తున్నారని ఆరోపించారు.ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.దళిత యువకుడు అమరేశ్వర్ను సినీ పక్కిలో వైసిపి నేతలు రాళ్లతో కొట్టి చంపేశారని ఆరోపించారు. నేరం చేసినది వైసిపి మహిళ నాయకురాలని పదేపదే చెప్తున్నా నేటికీ పోలీసులు ఆమెపై కనీస చర్యలు తీసుకోలేదని ఈ కేసు విషయంలో ఆమెకు సహకరిస్తున్న విశాఖ ఎంపీ సత్యనారాయణ తో పాటు ఆయన అనుచరుడు జీవిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు పై ఇంతటి ధర్నానికి పాల్పడిన వైసిపి నేతలపై ఏం చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రశ్నించారు. గతంలో దళిత యువకులపై దాడులు జరిగితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి పోరాటం చేశారని వారికి శిక్ష పడేవరకు పోరాటం కొనసాగించారని విషయాన్ని మూర్తి యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ కేసు విషయంలో  ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు పార్టీలకు అతీతంగా అమరేశ్వర్‌ కుటంబం కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు తెలియజేస్తున్నట్లు మూర్తి యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగానే అచ్యుతరావు  మాట్లాడుతూ  బాధిత కుటుంబానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు.హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకూ ఆయా కుటంబానికి ఆర్ధిక సాయంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్నారు. తన కోసం నిత్యం కష్టపడి పనిచేసే వ్యక్తుల కోసం తాను ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉంటానని, అమరేశ్వర్‌ తన ట్రస్టులో పనిచేసిన వ్యక్తి కావడంతో ఆయన కోసం తాను ఇంతటి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలను అరెస్టు చేయకపోవడం పోలీసుల వైపల్యంగా భావిస్తున్నానని, ఇప్పటికైనా నిందుతులను ఆరెస్టు చేసి ఆయా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా నేటికి ఎవ్వరూ స్పందించలేదని, బాధిత కుటుంబాన్ని స్ధానిక వైసీపీ నేతులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ నేటికి పరామర్శించకపోవడం సరికాదున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూటిమి పార్టీ నేతలంతా తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. పోరాటం వారు కూడా ముందుకు రావడం బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశాభావం తనకు ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేత పోతన రెడ్డి, బిజెపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి మురళీమోహన్ రాజు జనసేన పార్టీ నాయకులు నాగలక్ష్మి, పోతు వెంకటప్రసాద్, బాధిత కుటుంబ సభ్యలు తదితరులు పాల్గున్నారు.